Header Banner

తిరుపతి వ్యాపారికి షాక్‌..! ఇంటిపై బాంబు వేస్తామంటూ పాక్‌ నుంచి ఫోన్ కాల్!

  Thu May 08, 2025 09:03        Others

తిరుపతిలో నివసించే ఓ వ్యాపారికి పాకిస్థాన్ నుంచి వచ్చినట్లుగా చెబుతున్న ఓ ఫోన్‌కాల్ తీవ్ర కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి, ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తామంటూ ఆగంతకులు బెదిరించారు. విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది. తిరుపతికి చెందిన పగడాల త్రిలోక్‌ కుమార్‌ స్థానికంగా గాజుల వ్యాపారం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం ఆయన తన ద్విచక్ర వాహనంపై తిరుమల కొండకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఉండగా +92 32925 27504 అనే అంతర్జాతీయ నంబర్ నుంచి ఆయన మొబైల్‌కు ఓ కాల్ వచ్చింది.

ఫోన్ మాట్లాడిన వ్యక్తి తనను తాను పాకిస్థాన్‌కు చెందిన అధికారిగా పరిచయం చేసుకున్నట్లు సమాచారం. ఆగంతకుడు త్రిలోక్ కుమార్ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ "మీరు ఏం చేస్తున్నారో మాకు అంతా తెలుసు. జాగ్రత్తగా ఉండకపోతే మీ ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తాం" అని తీవ్ర స్వరంతో హెచ్చరించినట్లు బాధితుడు తెలిపారు. ఈ అనూహ్య పరిణామంతో తీవ్ర ఆందోళనకు గురైన త్రిలోక్‌ కుమార్‌ వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసులకు విషయం తెలియజేశారు.

ఈ ఘటనపై తిరుపతి క్రైమ్ విభాగం పోలీసులు స్పందించారు. సీఐ రామ్‌కిషోర్‌ మాట్లాడుతూ "ప్రాథమిక సమాచారం ప్రకారం పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి ఫోన్‌ చేసి బెదిరించినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. పూర్తిస్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి" అని వివరించారు. ఈ సంఘటనతో తిరుపతి నగరవాసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కాల్ డేటా ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Tirupati #BombThreat #PakistanCall #SecurityAlert #TirupatiNews #PhoneThreat #IndiaPakistan #PoliceInvestigation